- After-Shows
- Alternative
- Animals
- Animation
- Arts
- Astronomy
- Automotive
- Aviation
- Baseball
- Basketball
- Beauty
- Books
- Buddhism
- Business
- Careers
- Chemistry
- Christianity
- Climate
- Comedy
- Commentary
- Courses
- Crafts
- Cricket
- Cryptocurrency
- Culture
- Daily
- Design
- Documentary
- Drama
- Earth
- Education
- Entertainment
- Entrepreneurship
- Family
- Fantasy
- Fashion
- Fiction
- Film
- Fitness
- Food
- Football
- Games
- Garden
- Golf
- Government
- Health
- Hinduism
- History
- Hobbies
- Hockey
- Home
- How-To
- Improv
- Interviews
- Investing
- Islam
- Journals
- Judaism
- Kids
- Language
- Learning
- Leisure
- Life
- Management
- Manga
- Marketing
- Mathematics
- Medicine
- Mental
- Music
- Natural
- Nature
- News
- Non-Profit
- Nutrition
- Parenting
- Performing
- Personal
- Pets
- Philosophy
- Physics
- Places
- Politics
- Relationships
- Religion
- Reviews
- Role-Playing
- Rugby
- Running
- Science
- Self-Improvement
- Sexuality
- Soccer
- Social
- Society
- Spirituality
- Sports
- Stand-Up
- Stories
- Swimming
- TV
- Tabletop
- Technology
- Tennis
- Travel
- True Crime
- Episode-Games
- Visual
- Volleyball
- Weather
- Wilderness
- Wrestling
- Other
ఆశ - ఆశంక : డాక్టర్ సౌవేంద్ర హన్సడా రచన ( ఆంగ్ల మూలం)
’ఆశ – ఆశంక’ అనే ఈ కథ డాక్టర్ సౌవేంద్ర శేఖర్ హన్సడా గారు రాసిన ఆంగ్ల కథా సంపుటం ‘The Adivasi will not dance’ నించి స్వీకరించబడిన ‘Desire, Devination, Death’ అనే కథకు తెలుగు అనువాదం . ( కథ ఆంగ్ల మూలం – https://ur.booksc.eu/dl/28680189/d870eb)ఈ పుస్తకం ‘ Speaking Tiger Publications’ ద్వారా ప్రచురింపబడింది. 2015 సంవత్సరానికి ఈయన కేంద్ర సాహిత్య అకాడెమి యువ పురస్కారం గెలుచుకున్నారు. వృత్తిరీత్యా ప్రభుత్వ వైద్యులు. ఈ కథను శ్రావ్యంగా, భావ స్ఫోరకంగా హర్షణీయం కు చదివించిన స్వాతి గారికి కృతఙ్ఞతలు. స్వాతి గారి యుట్యూబ్ ఛానెల్ లో మరెన్నో తెలుగు కథలు మీరు వినవచ్చు. ఆశ – ఆశంక :వడి వడిగా నడుస్తోంది సుభాషిణి. ఆ మట్టి రోడ్డు మీద నడుస్తున్న వాళ్లందరినీ గబా గబా దాటుకొని వెళ్తోంది. సాయంకాలం నీరెండలో, ధూళి ఆమె పాదాల నుంచి ఓ చిన్న తెరలా పైకి లేవటం కనపడుతోంది. ఆమె మొహంలోకి పరికించి చూస్తే తన పెదాలు బిగబట్టి మనసులోని అల్లకల్లోల్లాన్ని తొక్కిపెడుతోందా అనిపిస్తోంది. ‘ఛకూలియా’ శనివారం సంత రద్దీ నించీ ఎలాగోలా తప్పించుకుని బయటపడింది తాను. ఇంటికి చేరుకోడానికి ఇంకా ఐదు కిలోమీటర్ల పైన నడవాలి. ‘రోషపల్’ లో ఉంటుంది సుభాషిణి.మామూలు రోజుల్లో అయితే, సుభాషిణి ఛకూలియాలో ఆగి, కమరిగూడ తోటల్లో అపుడే కోసిన ఆలుగడ్డలు, ఎర్రటి టమాటోలతో పాటూ ఒక మంచి ఆకు కూర కొంటుంది. అక్కణ్ణించీ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి బెస్త ముసిలిదాని గుడిసె ముందుకెళ్లి నిలబడి, ఖరీదైన ‘రూయి’ , ‘కాట్లా’ చేపలు తాజాగా లేవు అని నసుగుతూ, కొనేసేటట్టు బాగా బేరం చేసి చేసి , చవగ్గా దొరికే ‘బాష్ పాటాలు’ మాత్రం కొనుక్కుని వాటితో ఎండబెట్టి, కమ్మటి పులుసు చేసుకుందాం అని ఊహించుకుంటూ, చివరికి ‘మా మోనోసా’ స్వీట్ల షాపు దగ్గర ఆగి, తన పద్నాలుగేళ్ల పరూల్ కీ, పదకొండేళ్ల నిలుమోనీకీ , ఏడేళ్ల చంటోడు కూనా రామ్ కీ, ఓ అర డజను జోబె లడ్డూలు, సమోసాలు కొనుక్కుని, అపుడు కానీ ఇంటివైపు నడక మొదలు పెట్టదు. నాలుగు జిలేబీలు మాత్రం, కాయితపు పొట్లంలో దాచుకుని, ఆ పొట్లాన్ని గుండెలకదుముకొని నడుస్తోంది సుభాషిణి. ఒళ్ళు, కళ్ళు రోడ్డు మీదున్నట్టున్నా, తన ఆలోచనలు ఇంకెక్కడో తిరుగుతున్నాయి. తొందరగా పని ముగించుకు బయటపడదాం! అనుకున్నా కుదరలేదీరోజు. అందరినీ పలకరిస్తూ నిదానంగా నడిచే అలవాటున్న సుభాషిణి, పొద్దు పొడిచే ముందే ఇల్లు చేరడం అనేది చాలా అరుదు. మామూలు రోజుల్లో అయితే, సాయంకాలం పూట, సుభాషిణి తాను పనిచేసే రైస్ మిల్లు , ఇంకా అల్యూమినియం ఫ్యాక్టరీ , సోపు ఫ్యాక్టరీ , బద్రీనాథ్ సేటు తోట , దేవ్ బాబు కోళ్ల ఫారం, ఇంకా చుట్టుపక్కల కంస్ట్రక్షన్ సైట్లలో పని చేసే స్నేహితురాళ్ళ తో పాటూ కబుర్లు చెప్తూ ఊరి వైపు నడుస్తుంది. నేతచీరలు కట్టుకొని కొంతమంది, సిలుకు చీరలు కట్టుకొని ఇంకొంతమంది, పెద్దా చిన్నా ఆడవాళ్ళందరూ కలిసి, సీవెండి కారియర్లు మోసుకొని, తలగుడ్డలు నడుముకు చుట్టుకొనో, భుజానికి తగిలించుకునో, నవ్వుతూ, తుళ్ళుతూ, కేరింతలతో ఇంటికి నడిచే సమయం అది. ప్రైవేటు జీపుల, ఝార్ఖండ్ గవర్నమెంటు బస్సుల హారన్లతో, వాటిలో వుండే క్లీనర్లు తప్పుకోమంటూ పెట్టే కేకలతో మారుమోగుతూ ఉంటుంది ఆ రోడ్డు. అలిసిపోతేనో ఆలస్యమైపోతేనో తప్ప, మామూలుగా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళల్లో వీటిని ఆపి ఎక్కేవాళ్ళెవరూ ఉండరు,. ఎక్కారంటే మటుకు, ఇవ్వాల్సిన డబ్బుల గురించి సగానికి సగం బేరాలు మొదలు పెడతారు. ప్రతి పైసా మీదా హోరా హోరీ పోరాటంతో పాటూ శాపనార్థాలూ తిట్లూ అదనం. వాటినన్నిటినీ విని ఆనందిస్తూ ఇంకా ఇంకా ఉసికొల్పుతూ వుంటారు డ్రైవర్లు క్లీనర్లూ. లోపలున్న, చిన్నా పెద్దా అందరికీ ఇదో మంచి కాలక్షేపం. తన బొడ్డు సంచీలో వుండే చిల్లరను సాధ్యమైనంతవరకు కాపాడుకుంటూ, బండెక్కి ప్రయాణించే సౌకర్యాన్ని కూడా వినియోగించుకుంటూ, ఇలాంటి ఎన్నో పోరాటాల్లో పాల్గొన్న సుభాషిణికి, నిజానికి నడకంటేనే ఇష్టం. నడుస్తూ అయితే డుమినీతో కాస్సేపు మాట్లాడుకోవచ్చు. డుమిని సుభాషిణికి మంచి స్నేహితురాలు. పక్కూరు బలిపూర్లోనే ఉంటుంది. ఒకే చోట పనిచేస్తున్నా, ఇంటికి నడిచేటప్పుడే వాళ్ళిద్దరికీ మాట్లాడానికి సమయం దొరికేది. ముదురు ఎరుపులోకి మారుతున్న ఆకాశాన్ని ప్రతిఫలిస్తోందా అన్నట్టు మట్టి రోడ్డు లేత నారింజ రంగులో మెరుస్తోంది. పని ముగించుకుని ఇంటికి వెళ్లే ఆడవాళ్ల కబుర్లతో, గూళ్ళల్లో ఆశగా ఎదురుచూస్తున్న పిల్లల కోసం, ఆహారం నోట పెట్టుకుని వేగంగా ఎగురుతూ వెళ్లే పక్షుల శబ్దాలతో కోలాహలంగా వుంది వాతావరణం. సుభాషిణి నడకలో వేగం బాగా హెచ్చింది. ఒంటరిగా నడుస్తోంది. “ముందర నువ్వు