మనం రోజువారీ జీవితంలో వాడుతున్న లవంగంలో ఉన్న గుణాలు, వాటి ప్రాముక్యత ఏంటో తెలుసుకుందాం

0 Views· 11/14/22
Abhaya Ayurveda
Abhaya Ayurveda
0 Subscribers
0
In Drama

లవంగాల్లోని యుజెనాల్‌ అనే రసాయనానికి అద్భుత ఔషధ, పోషక విలువలు ఉన్నాయి. యుజెనాల్‌ కఫానికి విరుగుడుగా పనిచేస్తుంది.పంటినొప్పితో బాధపడేవాళ్లు ఓ లవంగవెుగ్గను బుగ్గన పెట్టుకుంటే వెంటనే తగ్గుతుంది. నోటి దుర్వాసననీ పోగొట్టి శ్వాసని తాజాగా ఉంచుతుంది.లవంగాలను నీళ్లలో మరిగించి తాగడంవల్ల అజీర్తి, తలతిరగడం, వాంతులు, అలసట వంటివి తగ్గుతాయి. అంతేకాదు, ఫ్లూ, జలుబు, సైనసైటిస్‌, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్‌ వంటివి కూడా తగ్గుముఖం పడతాయి.లవంగనూనెలో దూదిని ముంచి దంతాలు, చిగుళ్లులో నొప్పి వచ్చేచోట పెడితే ఇట్టే తగ్గిపోతుంది.పెద్దపేగులోని పరాన్నజీవుల్నీ సూక్ష్మజీవుల్నీ లవంగంలోని 'యుజెనాల్‌' నాశనం చేస్తుంది. అందుకే డయేరియా, నులిపురుగులు, జీర్ణసంబంధిత రుగ్మతలకి లవంగం మంచి మందు.రెండు లవంగాల్ని బుగ్గనపెట్టుకుని నమిలితే మద్యం తాగాలన్న కోరిక మాయమవుతుందట.రెండుమూడు లవంగాలకు కొంచెం పంచదార చేర్చి నూరి చల్లటినీళ్లలో కలిపి తాగితే గుండెల్లో మంట వెంటనే తగ్గుతుంది.జలుబుతో బాధపడేవాళ్లు కర్చీఫ్‌మీద రెండుమూడు చుక్కల లవంగనూనెని చల్లి వాసన పీలిస్తే ఫలితం ఉంటుంది.దగ్గు ఎక్కువగా ఉన్నపుడు .. టీలో శొంఠికి బదులు లవంగాలు వేసి తాగిన ఉపశమనం కలుగుతుంది .

Show more

 0 Comments sort   Sort By